అమ్మ

Amma


అమ్మ


ఆకలి అని తెలియక ఏడుస్తూ ఉంటే
ఆకలి తీరుస్తుంది అమ్మ
దెబ్బ తగిలి ఏడుస్తూ ఉంటే
తన తేనెల వంటి మాటలతో బాధను మరిపిస్తుంది అమ్మ
దీపం తాను కరుగుతూ
ప్రపంచానికి ఎలా వెలుగునిస్తుందో
ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా
చిరునవ్వుతో పలకరిస్తుంది అమ్మ
తాను కడుపు మార్చుకొని
చందమామ కథలు చెప్తూ
తన బిడ్డ కడుపు నింపుతుంది అమ్మ
చంద్రుని వెన్నెలలా చీకటి నుండి 
కష్టాలను దాటడానికి దారి చూపిస్తుంది.
తను ముళ్ళబాటలో నడుస్తూ
తన బిడ్డల్ని బంతిపూల బాటలో నడిపిస్తుంది అమ్మ
ప్రపంచానికి వెలుగు ఎంత ముఖ్యమో
ఒక బిడ్డకు తల్లి యొక్క ప్రేమ అంత ముఖ్యం.


written by : Maddikuntla Bharathi


DTP:  Thanagala Bharathi & T.Nandhiswari

moon light path

टिप्पणियाँ